KTR : బీజేపీపై కేటీఆర్ గరం గరం
పేరు మార్చుకుంటే బెటర్
KTR : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి రెచ్చి పోయారు. భారతీయ జనతా పార్టీ పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలను తన గుప్పిట్లోకి తీసుకుని బీజేపీయేతర వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు, బీజేపీయేతర ప్రభుత్వాలను కావాలని టార్గెట్ చేస్తోందంటూ ఆరోపించారు.
అంతే కాదు కేవలం తమ స్వలాభం కోసమే ఉప ఎన్నికను తీసుకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నికల కమిషన్ ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు.
విచిత్రం ఏమిటంటే ఎవరి కోసం ఎమ్మెల్యే రాజీనామా చేశారో, ఏ ప్రయోజనం ఆశించి చేశారనేది వారికే తెలియాలన్నారు. కేవలం కాంట్రాక్టుల కోసం తప్ప ప్రజల కోసం పార్టీలో చేరలేదన్నారు మంత్రి కేటీఆర్(KTR).
విచిత్రం ఏమిటంటే బీజేపీ ప్రస్తుతం అన్ని పాత్రాలు తానే నడుపుతోందని ఎద్దేవా చేశారు. ఎలక్షన్ కమిషన్ ప్రకటించాల్సిన తేదీలను దానికంటే బీజేపీ ప్రకటిస్తుందని దేశంలో ఏ పార్టీ ఇలా ఎప్పుడూ చేయలేదన్నారు.
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న బీజేపీ తన పేరు మార్చుకుంటే బావుంటుందని సూచించారు కేటీఆర్. అంతే కాదు ఈడీ కంటే ముందుగానే సోదాలు చేసే వారి పేరు చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు.
విచిత్రం ఏమిటంటే ఐటీ శాఖ కంటే వేగంగా నగదు వివరాలు చెబుతున్నారని, ఇక జాతీయ దర్యాప్తు సంస్థ కంటే ముందే బ్యాన్ విధిస్తున్నారని తెలిపారు. బీజేపీకి బదులు ఈసీ, సీబీఐ, ఎన్ఐఏ, ఈడీగా మార్చుకుంటే బెటర్ అని పేర్కొన్నారు.
Also Read : ఆరోగ్యంపై పర్యావరణ ప్రభావం – సౌమ్య