Minister KTR : టూరిస్ట్ లీడర్లను జనం నమ్మరు
ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్
Minister KTR : తెలంగాణ – రాష్ట్రంలో ఎన్నికలప్పుడు మాత్రమే కొందరు నేతలు వస్తుంటారని ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR). ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల జిల్లాలలో యువ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు.
Minister KTR Comment
ఇవాళ యువత బీఆర్ఎస్ వైపు ఉన్నారని, జరగబోయే ఎన్నికల్లో గెలుపు జెండా ఎగిరేది కేవలం గులాబీనేనని స్పష్టం చేశారు. తమ సీఎం కేసీఆర్ దార్శనికత, దక్షత కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారని ఆయన కృషి వల్లనే ఇవాళ తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ది చెందుతోందన్నారు.
ఆచరణకు నోచుకోని హామీలు ఇస్తూ ప్రజలను మభ్య పెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ధ్వజమెత్తారు. ఇవాళ 1 లక్షా 70 వేలకు పైగా తమ ప్రభుత్వం సర్కార్, ప్రైవేట్ ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ఇవాళ దేశానికే ఐటీ రంగంలో హైదరాబాద్ ఆదర్శ ప్రాయంగా నిలిచిందన్నారు.
తెలంగాణ తీసుకు వచ్చినన్ని పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. కొందరు పగటి వేషగాళ్లు వస్తుంటారని వారి వల్ల తెలంగాణకు నష్టం తప్ప ఒరిగేది ఏమీ ఉండదన్నారు కేటీఆర్.
Also Read : Katam Pradeep Kumar Goud : కాంగ్రెస్ కు షాక్ కాటం రిజైన్