Minister KTR : కాంగ్రెస్ దౌర్జన్యం కేటీఆర్ ఆగ్రహం
దాడులను సహించ బోమంటూ ప్రకటన
Minister KTR : హైదరాబాద్ – తమ పార్టీకి చెంది నాయకులను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులకు దిగడాన్ని తీవ్రంగా ఖండించారు మంత్రి కేటీఆర్(Minister KTR). ఇది మంచి పద్దతి కాదన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై స్వయంగా కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ తన అనుచరులతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో దమ్ముంటే ధైర్యంగా ఎదుర్కోవాలని కానీ ఇలా ప్రత్యక్ష దాడులకు దిగడం మంచి పద్దతి కాదన్నారు కేటీఆర్.
Minister KTR Serious Comments on Congress
గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గువ్వల బాల రాజును మంత్రి సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మొన్నటికి మొన్న దుబ్బాకలో తమ పార్టీకి చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డిపై కూడా ఇలాగే దాడులకు పాల్పడ్డారని, చివరకు ఆయన ఆస్పత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
తాజాగా అచ్చంపేటలో చోటు చేసుకున్న ఘటనను ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. దాడులతో తమ పార్టీ వారిని టార్గెట్ చేయాలని అనుకోవడం మంచి పద్దతి కాదన్నారు. ఒకవేళ తమ దండు కదిలితే తట్టుకోవడం కష్టమని హెచ్చరించారు. ప్రభుత్వ విప్ గువ్వల బాల రాజుకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు కేటీఆర్.
Also Read : CM KCR : సీఎం రెండో విడత ప్రచారం