Minister KTR : కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్
ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్
Minister KTR : హైదరాబాద్ – తెలంగాణ ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) నిప్పులు చెరిగారు. కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతి సంపద అని స్పష్టం చేశారు. అవాకులు చెవాకులు పేలితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ నుంచి భూమి లోని బొగ్గు దాకా అన్నింట్లో స్కాములే చేసింది ఆ పార్టీ తప్ప ఇంకోటి కాదన్నారు.
Minister KTR Slams Congress
కేటీఆర్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీని టార్గెట్ చేశారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ కేసులో నువ్వు, నీ తల్లి అవినీతికి పాల్పడింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదన్నారు. అక్రమాలకు పెట్టింది పేరు ఆ పార్టీనేనని, తిరిగి తమపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదని హెచ్చరించారు కేటీఆర్.
ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో బరా బర్ భారీ మెజారిటీతో బీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు. డిసెంబర్ 9న తాము తిరిగి ప్రమాణ స్వీకారం చేస్తామని జోష్యం చెప్పారు. దీనిని అడ్డుకునే శక్తి ఏ పార్టీకి లేదని స్పష్టం చేశారు కేటీఆర్.
Also Read : Tammineni Veerabhadram : సీపీఎం ఒంటరి పోరాటం