Minister KTR : కాంగ్రెసోళ్లు చిల్లరగాళ్లు – కేటీఆర్
అధికారంలోకి వస్తం బదులు తీర్చుకుంటం
Minister KTR : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మాటల యుద్దం కొనసాగుతోంది. చివరకు దాడులు చేసుకునేంత దాకా వెళ్లాయి. ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడుతూ మరింత హీట్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
Minister KTR Slams Congress Cadre
తాజాగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గువ్వల బాల రాజుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీ కృష్ణ ఆధ్వర్యంలో దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. ఓడి పోతామన్న ఫ్రస్ట్రేషన్ తో ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
ఇవాళ ఎవరో ఒకరు గెలవడం ఖాయమని , అలాంటప్పుడు ఇలాంటి భౌతిక దాడులకు దిగడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు కేటీఆర్(Minister KTR). ప్రజా క్షేత్రంలో దమ్ముంటే ధైర్యంగా ఎదుర్కోవాలని కానీ ఇలా దొంగదెబ్బ తీసేందుకు యత్నిస్తారా అంటూ నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని జోష్యం చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ బ్యాచ్ అంతా చిల్లరగాళ్లు అంటూ సంచలన కామెంట్స్ చేశారు మంత్రి. మొత్తంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తండ్రీ, కొడుకులకు పోయే కాలం దగ్గరకు వచ్చిందన్నారు.
Also Read : Mohammed Azharuddin : బీఆర్ఎస్ సర్కార్ బేకార్ – అజ్జూ