Minister KTR : డిక్ల‌రేష‌న్ స‌భ కాదు ఫ్ర‌స్టేష‌న్ స‌భ

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కామెంట్స్

Minister KTR : ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. కాంగ్రెస్ పార్టీని , టీపీసీసీ చీఫ్ ను ఏకి పారేశారు. చేవెళ్ల‌లో ఎస్సీ, ఎస్టీ ల కోసం పార్టీ డిక్లరేష‌న్ చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు.

Minister KTR Slams TPCC Chief

అది డిక్ల‌రేష‌న్ స‌భ కాద‌ని కేవ‌లం ఫ్ర‌స్టేష‌న్ ను తొల‌గించేందుకు ఏర్పాటు చేసిన స‌భ అంటూ సెటైర్ వేశారు కేటీఆర్(Minister KTR). క‌ర్ణాట‌క‌లో ఇటీవ‌లే కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ రేష‌న్ ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు . తెలంగాణ‌లో ఆ పార్టీ డిక్లరేష‌న్ చేయ‌డం దారుణ‌మ‌న్నారు.

రేవంత్ రెడ్డిని గాడ్సేతో పోల్చాడు కేటీఆర్. తానే గెలుస్తాడ‌న్న గ్యారెంటీ లేద‌ని , కానీ ఇక మీరిచ్చే 12 గ్యారెంటీల‌కు విలువేదని ప్ర‌శ్నించారు. చైత‌న్యానికి ప్ర‌తిరూపం తెలంగాణ ప్ర‌జ‌లు. వాళ్ల‌కు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసం గురించి బాగా తెలుస‌న్నారు.

కాంగ్రెస్ పార్టీకి విజ‌న్ లేద‌ని ఇక డిక్ల‌రేష‌న్ గురించి ఎలా న‌మ్ముతారంటూ ప్ర‌శ్నించారు కేటీఆర్. డ‌జ‌న్ హామీలు గాలిలో దీపాలేనంటూ మండిప‌డ్డారు .

Also Read : PM Modi : నీర‌జ్ చోప్రాకు ప్ర‌ధాని అభినంద‌న‌

Leave A Reply

Your Email Id will not be published!