KTR : కిషన్ రెడ్డిపై కేటీఆర్ కన్నెర్ర
నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు
KTR : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి(Kishan Reddy) నోరు తెరిస్తే అన్నీ అబద్దాలు తప్పా నిజాలు మాట్లాడటం లేదని మండిపడ్డారు. ఇంత కంటే దౌర్భాగ్యం లేని తప్పుడు సమాచారం ఇచ్చే మంత్రిని తాను ఇంత వరకు చూడ లేదన్నారు.
రాష్ట్రంలో తొమ్మిది మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు సత్య దూరమని పేర్కొన్నారు కేటీఆర్. ఆయన శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. కిషన్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయన పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
ఒక సోదరుడిగా తనకు గౌరవం ఉందని కానీ ఇలాంటి పచ్చి అబద్దాలు చెబుతారని తాను అనుకోలేదన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర సర్కార్ తొమ్మిది కాలేజీలు మంజూరు చేసినట్లు చెప్పారని అవి ఎక్కడున్నాయో చెప్పాలని కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు. ఇలాంటి అబద్దాలు మాట్లాడేందుకు మనసు ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
తమకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. ఫక్తు అబద్దాలు చెపుతూ ప్రజలను మభ్య పెట్టడం మంచి పద్దతి కాదన్నారు కేటీఆర్. అంతే కాకుండా హైదరాబాద్ లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ని నెలకొల్పాలని భావిస్తున్నట్లు చెప్పారు.
అది కూడా పూర్తి అబద్దమేనంటూ మండిపడ్డారు మంత్రి. మోదీ మెప్పు కోసం మీరు తప్పుడు ప్రకటనలు, అవాస్తవాలు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. కాగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని బీజేపీ ఏనాడూ తెలంగాణకు హామీ ఇవ్వలేదని అన్నారు కిషన్ రెడ్డి.
Also Read : సెప్టెంబర్ లో జీఎస్టీతో రూ. 1.47 లక్షల కోట్లు