KTR Modi : మోదీజీ ఇదేనా నారీ శక్తి అంటే – కేటీఆర్
దోషులను విడుదల చేయడంపై కామెంట్
KTR Modi : గుజరాత్ లోని బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను విడుదల చేయడంపై స్పందించారు మంత్రి కేటీఆర్. ఇదేనా మోదీజీ నారీ శక్తి అంటే అని ప్రశ్నించారు. మహిళల గురించి గొప్పగా మాట్లాడారు(KTR Modi).
కానీ చేతల్లోకి వచ్చేసరికల్లా అత్యాచారానికి పాల్పడిన వారని రిలీజ్ చేశారు. అసలు దేశంలో మహిళలకు విలువ అనేది ఉందా అని నిలదీశారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు.
కేటీఆర్ తో పాటు విపక్షాలు కూడా విరుచుకు పడ్డాయి ఈ ఘటనపై. ఐపీసీ , సీఆర్పీసీ కి అవసరమైన సూవరణలు చేయాలని సూచించారు.
దీని ద్వారా ఏ రేపిస్ట్ న్యాయ వ్యవస్థ ద్వారా బెయిల్ పొంద లేరని పేర్కొన్నారు కేటీఆర్(KTR Modi) . 11 మంది వ్యక్తులు దాదాపు 15 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారు.
వారి విడుదలను గుజరాత్ సర్కార్ సమర్థించు కోవడం దారుణమని పేర్కొన్నారు. సామూహిక అత్యాచారం, హత్య రెండింటికీ శిక్ష పడిన వారిని అకాల విడుదలకు అనుమతించదు.
కానీ ఇక్కడ వర్తించే 1992 పాలసీకి అలాంటి మినహాయింపు లేదని పేర్కొనడం విడ్డూరమన్నారు. బిల్కిస్ బానో వయస్సు 21 ఏళ్లు. ఐదు నెలల గర్బిణీ . మార్చి 3, 2002న దాహోద్ జిల్లాలో ఆమెపై అత్యాచారం చేశారు.
ఆమె మూడేళ్ల కూతురుతో పాటు కుటుంబానికి చెందిన ఆరుగురితో హత్యకు గరైంది. హింస నుండి తప్పించు కోవాలనే ఆశతో వారు పొలాల్లో దాక్కున్నారు.
ఆ సమయంలో నరేంద్ర మోదీ సీఎంగా ఉన్నారని తెలిపారు. 2019లో సుప్రీంకోర్టు ఆమెకు ఇల్లు, ఉద్యోగంతో పాటు రూ. 50 లక్షలు పరిహారం గా ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ ను ఆదేశించింది.
అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలు శాంతించాలని కోరుతున్నామన్నారు బానో భర్త రసూల్.
Also Read : తెలంగాణ ఆదర్శం మోదీ ఆటంకం