Minister KTR : అబద్దాలకు కేరాఫ్ రేవంత్ -కేటీఆర్
ఐటీ, పురపాలిక శాఖ మంత్రి
Minister KTR : హైదరాబాద్ – అబద్దాలు చెప్పడంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరితేరాడని ఆరోపించారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్. తాను ఆర్ఎస్ఎస్ లో పని చేయనని, ముస్లింలను ద్వేషించనని రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటన చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు.
Minister KTR Comments on Revanth Reddy
కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఆ పార్టీని ఎవరూ నమ్మడం లేదు. కారణం తెలంగాణను ఇవ్వకుండా చాలా కాలం పాటు అడ్డుకున్నది ఆ పార్టీనేనంటూ ఆరోపించారు కేటీఆర్(Minister KTR). రైతులకు 24 గంటల పాటు తాము పవర్ ఇస్తున్నామని కానీ రేవంత్ రెడ్డి రైతులకు వ్యతిరేకంగా పవర్ లోకి వస్తే మూడు గంటలు మాత్రమే ఇస్తానంటూ ప్రకటిస్తున్నాడని ధ్వజమెత్తారు.
సీఎం కేసీఆర్ పై అవాకులు , చెవాకులు పేలుతున్నాడని మండిపడ్డారు కేటీఆర్. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేక పోతే జనం తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఆచరణకు నోచుకోని హామీలను ఇవ్వడం పరిపాటిగా మారిందన్నారు.
నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచించారు. బహింరంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : Posani Krishna Murali : పోసానికి బిగ్ షాక్