Minister KTR : సంస్కార హీనుడు రేవంత్ రెడ్డి
తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయం
Minister KTR : ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డిపై భగ్గుమన్నారు. అత్యంత సంస్కార హీనంగా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు కేటీఆర్(KTR). ఇది ఎంత మాత్రం ఎవరూ హర్షించరని పేర్కొన్నారు కేటీఆర్.
Minister KTR Shocking Comments
ప్రత్యేకించి, పనిగట్టుకుని సీఎం కేసీఆర్ ను వ్యక్తిగతంగా విమర్శలు గుప్పిస్తూ రేవంత్ రెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడంటూ ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు కేటీఆర్.
ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని , జైలుకు పోయి వచ్చిన రేవంత్ రెడ్డి స్థాయి మించి మాట్లాడటం సభ్యత కాదన్న విషయం తెలుసు కోవాలన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా జనం నమ్మరని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.
తమ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు అవుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు ఐటీ శాఖ మంత్రి. కించిత్ సంస్కారం లేకుండా దిగజారి మాట్లాడం దారుణమన్నారు కేటీఆర్.
Also Read : Rohit Sharma Launch : యుఎస్ లో రోహిత్ క్రికెట్ అకాడమీ