Minister KTR : తెలంగాణ అభివృద్ది దేశానికి దిక్సూచి
ఐటీ , పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్
Minister KTR : హైదరాబాద్ – తెలంగాణ ఐటీ , పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. దేశంలోనే తలసరి వినియోగంలో , విద్యుత్ సరఫరాలో తెలంగాణ రాష్ట్రం టాప్ లో ఉందన్నారు.
Minister KTR Comments Viral
సోమవారం మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు కేంద్ర సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. మాయ మాటలు చెప్పడం తప్పితే దేశం కోసం మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. బీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రభుత్వాలు సాధించింది ఏమీ లేదన్నారు.
కేవలం మాయ మాటలతో , హిందూత్వ ఎజెండా పేరుతో కాలం వెళ్ల దీస్తున్నారే తప్పా దేశానికి మంచి పని చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. 2013 -14లో విద్యుత్ లోటు రాష్ట్రంగా అంచనా వేయబడిన తెలంగాణ ఇప్పుడు విద్యుత్ మిగులు రాష్ట్రంగా నిలిచిందని పేర్కొన్నారు కేటీఆర్(Minister KTR). దేశంలో తలసరి వినియోగంలో నెంబర్ వన్ గా ఉందని స్పష్టం చేశారు.
అంతే కాకుండా రైతులకు 24/7 ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆ విషయం గుర్తు పెట్టుకుంటే బెటర్ అని సూచించారు. తెలంగాణ అభివృద్ది నమూనా దేశానికి ఆదర్శ ప్రాయమని కుండ బద్దలు కొట్టారు కేటీఆర్. ఇకనైనా సొల్లు కబుర్లు ఆపి డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టాలన్నారు.
Also Read : PM Modi : భారత దేశం అత్యంత కీలకం – మోదీ