Minister KTR : కొలువుల కల్పనలో తెలంగాణ టాప్
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
Minister KTR : హైదరాబాద్ – ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదన్నారు మంత్రి కేటీఆర్. తాము కొలువు తీరిన తర్వాత భారీ ఎత్తున జాబ్స్ ను భర్తీ చేయడం జరిగిందని చెప్పారు. 2014లో ఐటీ సెక్టార్ లో కేవలం 3.23 లక్షల మంది మాత్రమే పని చేసే వారని తెలిపారు. కానీ తాను ఐటీ శాఖను టేకోవర్ చేసుకున్నాక సీన్ మారిందన్నారు. పెద్ద ఎత్తున జాబ్స్ ను భర్తీ చేస్తూ వస్తున్నామని చెప్పారు.
Minister KTR Comments
ఇవాళ యావత్ ప్రపంచంలోని టాప్ కంపెనీలన్నీ హైదరాబాద్ లో కొలువు తీరాయని, మరికొన్ని ఈ నగరమే కావాలని ఏరి కోరి ఎంచుకుంటున్నాని ఇంత కంటే ఇంకేం కావాలని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వమైనా సరే వేలాది జాబ్స్ ను భర్తీ చేయదని స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు.
ప్రపంచం మారుతోందని దానికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్(Minister KTR). విమర్శలు చేసినంత మాత్రాన ఓట్లు పడతాయని అనుకోవడం మంచి పద్దతి కాదన్నారు. ఈ ఏడాది వరకు చూస్తే ఒక్క ఐటీ సెక్టార్ లోనే ఏకంగా 10 లక్షల మంది పని చేస్తున్నారని వెల్లడించారు. ఇంతకంటే ఇంకేం కావాలని నిలదీశారు కేటీఆర్.
Also Read : Teenmar Mallanna : మల్లన్న స్వరం వెంకన్న జపం