Minister KTR : మేమే గెలుస్తం మాదే అధికారం
నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్
Minister KTR : ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చుక్కలు చూపించడం ఖాయమన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి ఢిల్లీ బానిసలకు మధ్య పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాలమూరు జిల్లాను శాశ్వతంగా కోనసీమగా మార్చేస్తామని చెప్పారు. ఈ జిల్లా వాసులు అత్యంత తెలివైన వారని కొనియాడారు.
Minister KTR Said About Palamuru Dist
ఒకనాడు తనకంటూ ఎదురు లేదని విర్ర వీగిన మాజీ సీఎం, దివంగత నందమూరి తారక రామారావును కల్వకుర్తి ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. ఇక్కడి ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువని అన్నారు. ఆ దెబ్బకు ఎన్టీఆర్ జడుసుకున్నాడని అన్నారు. ఎందరో ఉద్దండులు , రాజకీయ నాయకులు ఇక్కడి నుంచి వచ్చిన వారేనని పేర్కొన్నారు కేటీఆర్.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లలో ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా కలిసి పని చేయాలని సూచించారు. ఇక టీపీసీసీ చీఫ్ పదవి పిచ్చోడి చేతిలో రాయి లాగా మారిందన్నారు. ఆ ఒక్క పదవిని చూసి తాను అమెరికా ప్రెసిడెంట్ అయినట్లు ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్(KTR). కాంగ్రెస్ పార్టీకి పట్టుమని పోటీ చేసేందుకు 40 మంది అభ్యర్థులు కూడా లేరన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలలు కంటున్నాయని కానీ వారికి అంత సీన్ లేదన్నారు కేటీఆర్.
Also Read : V Srinivas Goud : పకడ్బందీగా మద్యం టెండర్ల డ్రా