Minister Mallareddy : మేడ్చల్ అభ్యర్థులను నేనే డిసైడ్ చేస్తా
మంత్రి మల్లారెడ్డి ఘాటు కామెంట్స్
Minister Mallareddy : తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మేడ్చల్ శాసనసభ సీటుకు సంబంధించి ఏ పార్టీలో ఎవరు ఉండాలనేది కూడా తానే నిర్ణయిస్తానని అన్నారు. గురువారం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు.
Minister Mallareddy Said
మా స్వంత పార్టీలో ఎవరు అభ్యర్థి అనేది నేనే డిసైడ్ చేస్తా. ఇక ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా ఎవరు అభ్యర్థులుగా నిలబడాలో కూడా నేనే చూసుకుంటానని అన్నారు. 2018లో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)కు కూడా నేనే టికెట్ ఇప్పించానని చెప్పారు మంత్రి చామకూర మల్లారెడ్డి(Mallareddy). ప్రస్తుతం తాను మంత్రిగా ఉన్నా అన్ని పార్టీలలో దోస్తులు ఉన్నారని వాళ్లు నేను ఏం చెబితే అది చేసేందుకు సిద్దంగా ఉంటారని జోష్యం చెప్పారు.
ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై భగ్గుమన్నారు. షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయనపై తొడ గొట్టిన ఆ తర్వాత నా రేంజ్ ఏమిటో పెరిగింది. అంతే కాదు నా గ్రాఫ్ కూడా అమాంతం ఊహించని రీతిలో పైకి చేరిందన్నారు చామకూర మల్లారెడ్డి. త్వరలోనే నాకంటూ ఓ ఛానల్ ఉండాలని అనుకుంటున్నా. ఓ మీడియా సంస్థను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అంతే కాదు తెలంగాణ యాస, భాష, సంస్కృతి నేపథ్యంలో సంవత్సరానికి నాలుగు సినిమాలు తీస్తానని అన్నారు మల్లారెడ్డి.
Also Read : Daggubati Purandeswari : నిధులు పక్కదారి పట్టిస్తే ఎలా