Priyank Kharge : కండక్టర్ గా మారిన మంత్రి ఖర్గే
కన్నడ నాట ప్రియాంక్ వెరీ స్పెషల్
Priyank Kharge : ఎవరీ ప్రియాంక్ ఖర్గే అనుకుంటున్నారా. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తనయుడు. తాజాగా కన్నడ నాట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆపై కేబినెట్ లో కొలువు తీరారు మంత్రిగా. వచ్చీ రావడంతోనే తన శాఖలో ఏం జరుగుతుందోనని ఆరా తీశారు. ఆపై సమీక్షలు చేపట్టారు. బిజీగా మారారు. అంతే కాదు మంత్రులకు భిన్నంగా సంచలన ప్రకటన చేశారు ప్రియాంక్ ఖర్గే.
తన వద్దకు వచ్చే వాళ్లు ఎవరైనా సరే నాయకులు, అభిమానులు, సన్నిహితులు, హితులు, కుటుంబీకులు దయచేసి శాలువాలు, బొకేలు తీసుకు రావద్దని కోరారు. వాటి స్థానంలో మంచి పుస్తకాలను బహుమతిగా ఇవ్వమని కోరారు. మంత్రి ప్రియాంక్ ఖర్గే(Priyank Kharge) ఇచ్చిన పిలుపునకు భారీ ఎత్తున ప్రజల నుంచి స్పందన లభించింది.
పెద్ద ఎత్తున పుస్తకాలు పోగవుతున్నాయి. వీటిని ఆయన తను చేపట్టిన శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీల లోని లైబ్రరీలకు అందచేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
కాగా సోమవారం ప్రియాంక్ ఖర్గే ఎవరూ ఊహించని రీతిలో ఆర్టీసీ బస్సులోకి ఎక్కారు. ఆపై కండక్టర్ అవతారం ఎత్తారు. ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సమకూర్చుతోంది. ఇందులో భాగంగా స్త్రీ శక్తి అనే పథకానికి సీఎం సిద్దరామయ్య శ్రీకారం చుట్టారు. స్వయంగా ప్రియాంక్ ఖర్గే తనే టికెట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.
Also Read : MK Stalin : హిందీని రుద్దాలని చూస్తే ఖబడ్దార్ – స్టాలిన్