RK Roja KCR : ఏపీలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు – రోజా
కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై కామెంట్స్
RK Roja KCR : ఏపీ రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా సంచలన కామెంట్స్ చేశారు. భారత రాష్ట్ర సమితి పార్టీపై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపాయి. ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రంలోనైనా పెట్టుకోవచ్చని అన్నారు. ఇందుకు ఎవరూ అభ్యంతరం చెప్పరన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి. ఎన్ని పార్టీలు వచ్చినా వైఎస్సార్ పార్టీని ఢీకొన లేవని స్పష్టం చేశారు.
తమకు ఎవరి పట్ల వ్యతిరేక భావం లేదని కానీ నిన్నటి దాకా ఆంద్రోళ్లను తిట్టిన తిట్టు తిట్టకుండా వచ్చిన కేసీఆర్ పార్టీని విస్తరించడం విస్తు పోయేలా చేసిందన్నారు. ఇక పార్టీ పరంగా మాట్లాడితే ఎవరైనా ఎన్ని పార్టీలైనా పెట్టుకోవచ్చన్నారు. పోటీ కూడా చేయొచ్చు.
అది వాళ్ల ఇష్టం..వాళ్లకు హక్కు ఉంది. అది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అవకాశం కల్పించిందన్నారు ఆర్కే రోజా. ఆమె మాజీ మంత్రి పేర్ని నాని కంటే ముందుగా స్పందించారు. మీడియాతో మాట్లాడారు. ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలకు పైగా అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి. ఇప్పటికే విభజన సమస్యలు పరిష్కారానాకి నోచు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్కే రోజా. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. ఒంటరిదాన్ని చేశారు.
తీవ్రంగా నష్ట పోవడానికి ప్రధాన కారణం తెలంగాణ వాళ్లే. అంటే సీఎం కేసీఆరే. ముందు ఏపీకి రావాల్సిన నిధులను ఇచ్చి మాట్లాడాలని అన్నారు మంత్రి. చంద్రబాబు నాయుడు నోటు కేసును అడ్డం పెట్టుకుని ఏపీకి నష్టం చేశారంటూ ధ్వజమెత్తారు ఆర్కే రోజా(RK Roja KCR).
Also Read : బీఆర్ఎస్ పై పేర్ని నాని కామెంట్స్