Minister Satyakumar Yadav: మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్
మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్
Minister Satyakumar Yadav : ఏపీ వైద్యరోగ్య శాఖ మంత్రి, బీజేపీ నేత సత్య కుమార్ యాదవ్ కు కూడా నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ బెడద తప్పలేదు. ఇటీవల నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ను క్రియేట్ చేసి బంధువులు, స్నేహితులకు మెసేజ్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరగాళ్ళు… మంత్రి సత్యకుమార్(Minister Satyakumar Yadav) పేరుతో ఓ నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ను క్రియేట్ చేసి అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీనిని వెంటనే గుర్తించిన మంత్రి కార్యాలయం సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారించగా ప్రస్తుతం ఆ అకౌంట్ ఇన్ యాక్టివ్ గా ఉన్నట్లు గుర్తించారు.
Minister Satyakumar Yadav Fake Facebook
మంత్రి సత్యకుమార్(Minister Satyakumar Yadav) పేరుతో కొంత మంది ఫేస్‌బుక్ అకౌంట్‌ను క్రియేట్ చేశారు. ఈ అకౌంట్‌లో గత కొంత కాలంగా బీజేపీకి సంబంధించిన, మంత్రి పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన పోస్టింగ్‌లు పెడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం అసభ్యకరమైన ఓ ఫోటోను ఆ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీన్ని గుర్తించిన మంత్రి కార్యాలయం వెంటనే అలెర్ట్ అయ్యింది. ఈ అకౌంట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అకౌంట్‌ను అప్పర్ తిరుపతి నుంచి రన్ చేస్తున్నట్లు అకౌంట్లో పేర్కొన్నారు. ఒక ఫోన్ నెంబర్‌ను కూడా అకౌంట్‌లో ఇవ్వడం జరిగింది. అకౌంట్ విషయంపై మంత్రి కార్యాలయానికి సమాచారం వెళ్లగా.. వెంటనే రీచెక్ చేసుకున్న సిబ్బంది.. అకౌంట్‌పై అప్పటికే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
మంత్రులకు ఉన్న మంచి పేరును డీమోరలైజ్ చేయడానికి కొంత మంది ఇలా ఫేస్‌బుక్ అకౌంట్, సోషల్ మీడియా అకౌంట్లను నకిలీవి సృష్టించి వారికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే ఈ నకిలీ అకౌంట్ ప్రస్తుతం ఇన్‌యాక్టివేట్‌లో ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇకపై ఎవరైనా ఇలా నకిలీ అకౌంట్ సృష్టించి సమాజంలో గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న వారిని ఇబ్బందులు పెట్టకుండా పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పేషీ అధికారులు కోరుతున్నారు.
Also Read : CM Chandrababu Naidu: ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్ ! ఆగస్టు 15నుంచి మహిళలకు ఫ్రీ బస్సు !