Narendra Singh Tomar : కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ డిమాండ్ కు సరిపడా గోధుమలు భారత దేశం వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. యావత్ ప్రపంచానికి సరిపడా కావాల్సినంత తమ వద్ద ఉన్నాయని చెప్పారు.
కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎప్పుడైనా ఎంతైనా నిధులు ఇచ్చేందుకు తమ దేశం సిద్దంగా ఉందన్నారు.
అంతర్జాతీయ డిమాండ్ కు సరిపడా గోధుమలు భారత్ వద్ద ఉన్నాయని వెల్లడించారు నరేంద్ర సింగ్ తోమర్(Narendra Singh Tomar). భారత దేశంలో తగినంత గోధుమలు అందుబాటులో ఉన్నాయి.
ప్రపంచ అవసరాలను తీర్చేందుకు తాము రెడీగా ఉన్నామని ప్రకటించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం అంతర్జాతీయ మార్కెట్ లో గోధుమ సరఫరాకు అంతరాయం కలిగించింది.
అంతర్జాతీయ స్థాయిలో భారతీయ గోధుమలకు భారీ ఎత్తున డిమాండ్ ఉందన్నారు నరేంద్ర సింగ్ తోమర్(Narendra Singh Tomar). యుద్దం వల్ల గోధుమల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ పరంగా చోటు చేసుకునే కొరతను నివారించే సత్తా భారత్ వద్ద ఉందన్నారు తోమర్. తాము ఎలాంటి ఇబ్బంది పడడం లేదన్నారు.
అయితే కొంత ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. భారత దేశం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుందని , ఇందులో అన్నింటిని ఎదుర్కొనేందుకు ప్లాన్ తమ వద్దని స్పష్టం చేశారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి .
ప్రపంచ గోధుమల్లో రష్యా, ఉక్రెయిన్ దేశాల వాటా ఏకంగా 29 శాతాని కంటే పైగా ఉంది. ఏమైనా ఎఫెక్టు పడుతుందా అన్న ప్రశ్నకు లేదని చెప్పారు తోమర్.
Also Read : మాజీ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ అరెస్ట్