Channi Sister In Law Quits : మంత్రి ఫైర్ చన్నీ కోడలు రిజైన్
పంజాబ్ లో ఆరోగ్య మంత్రి నిర్వాకం
Channi Sister In Law Quits : పంజాబ్ రాష్ట్రంలో భారీ మెజారిటీతో కొలువు తీరిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి తమ వారి నుంచే కొత్త తలనొప్పులు వస్తున్నాయి.
ప్రధానంగా ఆరోగ్య శాఖ మంత్రి చేతన్ సింగ్ జౌర మజ్రా వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆ శాఖకు చెందిన సిబ్బంది తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఇటీవల బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజ్ బహదూర్ జౌర మజ్రాను అవమానించారు. దీంతో ఆయన తట్టుకోలేక బోరుమన్నారు.
ఆపై విలేకరుల సమావేశంలో తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయనకు మంచి పనిమంతుడు అన్న పేరుంది. తనిఖీలో భాగంగా మంత్రి దురుసుగా ప్రవర్తించడంపై కంటతడి పెట్టారు.
దీంతో చివరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రాద్దాంతం చోటు చేసుకోవడంతో స్వయంగా సీఎం భగవంత్ మాన్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. తెలియక తప్పిదం జరిగిందంటూ తెలిపారు.
మీ రాజీనామాను తాను ఆమోదించడం లేదంటూ ప్రకటించారు. ఈ వివాదం ఇంకా సద్దుమణుగక ముందే మరో వివాదానికి తెర లేపారు ఆరోగ్య శాఖ మంత్రి చేతన్ సింగ్ జౌర మజ్రా.
తాజాగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ కోడలు డాక్టర్ మణీందర్ కౌర్(Channi Sister In Law Quits) పట్ల బహిరంగంగా అవమాన పర్చినట్లు మంత్రిపై ఆరోపణలు ఉన్నాయి.
చన్నీ సోదరుడు డాక్టర్ మనోహర్ సింగ్ భార్య. అసెంబ్లీ ఎన్నికల్లో బస్సీ పఠానా నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడి పోయారు.
ఆరోగ్య మంత్రి టూర్ కు ముందే తన భార్య పదవీ విరమణ ఎంచుకుందని తెలిపారు. ఆస్పత్రి బదిలీ జాబితాలో ఆమె పేరు ఉండడం చర్చకు దారి తీసింది.
Also Read : బృహన్ మఠం సేవలు అద్భుతం