Congress Joinings : కాంగ్రెస్ లో చేరిన మైనార్టీ నేత‌లు

అయూబ్ ఖాన్, కుమారుల చేరిక‌

Congress Joinings : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరిక‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. వివిధ పార్టీల‌కు చెందిన నేత‌లు క్యూ క‌డుతున్నారు. త్వ‌రంలో రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో పార్టీకి ఎడ్జ్ ఉంద‌ని అంచ‌నాలు కొన‌సాగుతున్న త‌రుణంలో ప‌లువురు గ‌తంలో పార్టీని వ‌దిలి వేసిన వారు, రావాల‌ని అనుకున్న నేత‌లు, టికెట్ల‌ను ఆశిస్తున్న అభ్య‌ర్థులు కాంగ్రెస్ పార్టీలో(Telangana Congress) చేరేందుకు ఉత్సుక‌త చూపుతున్నారు.

Congress Joinings Viral

ఈ త‌రుణంలో సోమ‌వారం హైద‌రాబాద్ లోని గాంధీ భ‌వ‌న్ లో తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఆధ్వ‌ర్యంలో న‌గ‌రానికి చెందిన ప్ర‌ముఖ మైనార్టీ నాయ‌కులు కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. వారిని సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు ఠాక్రే.

ఇవాళ పార్టీలో చేరిన వారిలో హైద‌రాబాద్ కు చెందిన అయూబ్ ఖాన్ , ఆయ‌న కుమారులు షాబాజ్ ఖాన్ , అర్బాజ్ ఖాన్ లు ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఠాక్రే, కార్య‌ద‌ర్శి ఇంఛార్జి రోహిత్ చౌద‌రి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతే కాకుండా హైద‌రాబాద్ జిల్లా మైనార్టీ చైర్మ‌న్ అర్హ‌మ్ ఆదిల్ బ‌హదూర్ పురా నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే క‌లీమ్ బాబా , హైద‌రాబాద్ లో సీనియ‌ర్ మైనార్టీ నేత‌గా ఉన్న మీర్ అస‌ద్ అలీ తో పాటు ఇత‌ర సీనియ‌ర్ మైనార్టీ నేత‌లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Also Read : Pawan Kalyan : ఛాన్స్ ఇస్తే ఐటీని అభివృద్ది చేస్తా

Leave A Reply

Your Email Id will not be published!