Missile Misfire : మిస్సైల్స్ మిస్ ఫైర్ ఆఫీసర్స్ పై వేటు
కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం
Missile Misfire : ఇప్పటికే దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితి నెలకొంది. సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ తరుణంలో ఉన్నట్టుండి పాకిస్తాన్ లోకి పొరపాటున భారత్ కు చెందిన బ్రాహ్మోస్ క్షిపణులను(Missile Misfire) ప్రయోగించింది. దీంతో ఉన్నట్టుండి భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
అనుకోకుండా జరిగిన ఈ హఠత్ పరిణామానికి పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా భారత్ ఇది పూర్తిగా తమ పొరపాటేనని ఒప్పుకుంది.
ఆ మేరకు క్షిపణుల ప్రయోగానికి కారణమైన భారత(India) వైమానిక దళానికి చెందిన ముగ్గురు వాయుసేన అధికారులను వెంటనే విధుల నుంచి తొలగించింది.
అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ పొరపాటుకు చింతిస్తున్నట్లు స్పష్టం చేసింది పాకిస్తాన్ ప్రభుత్వానికి. కాగా ఈ ఘటనకు సంబంధించి ఇంకా పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించ లేదు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం ఇప్పటికీ తమదేనంటూ అంతర్జాతీయంగా ప్రతీసారి పాకిస్తాన్ వాదిస్తూనే వస్తోంది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, భావోద్వేగాలు నెలకొన్నాయి.
ఈ తరుణంలో క్షిపణుల ప్రయోగం మరింత రచ్చకు , రాద్ధాంతానికి దారి తీసే అవకాశం లేక పోలేదు. ఇదిలా ఉండగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ ఘటన పై న్యాయ విచారణ అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది కేంద్రం.
ఇక తొలగింపునకు గురైన వారిలో గ్రూప్ కెప్టెన్ , వింగ్ కమాండర్ , స్క్వాడ్రన్ లీడర్ ఉన్నారు. ఎస్ఓపీలో చేసిన పొరపాటు వల్లనే మిస్సైల్స్ ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలో పడ్డాయని తెలిపింది.
Also Read : మమ్మల్ని చూసి బీజేపీ జంకుతోంది