MK Stalin : బీజేపీపై సీఎం స్టాలిన్ సెటైర్

10 శాతం స్కోర్ తో థ‌ర్డ్ ఫోర్స్ ఎలా

MK Stalin  : భార‌తీయ జ‌న‌తా పార్టీపై త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ సెటైర్లు విసిరారు. ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో ప‌ర్య‌టించిన ఆయ‌న చెన్నై లో మీడియాతో మాట్లాడారు.

కేవ‌లం 10 శాతం స్కోర్ క‌లిగిన బీజేపీ రాష్ట్రంలో తాము థ‌ర్డ్ ఫోర్స్ అని చెబుతోంద‌ని, ఇది ఎలా సాధ్య‌మ‌ని ప్ర‌శ్నించారు స్టాలిన్. గ‌త ఫిబ్ర‌వ‌రి నెల‌లో జ‌రిగిన ప‌ట్ట‌ణ‌, స్థానిక‌, పుర సంస్థ‌ల ఎన్నిక‌ల త‌ర్వాత త‌మిళ‌నాడులో డీఎంకే, ఏఐడీఎంకే త‌ర్వాత మూడో అతి పెద్ద బీజేపీ అవ‌త‌రించిన‌ట్లు చెప్ప‌డాన్ని ఎద్దేవా చేశారు.

తాము వంద మార్కుల‌కు గాను 90 పాయింట్లు సాధించామ‌ని, మిగ‌తా పార్టీల‌కు 50 శాతం, 10 శాతం స్కోర్ సాధించి ప్ర‌గ‌ల్భాలు ప‌లికితే ఎలా అని ప్ర‌శ్నించారు.

ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో యూపీలో బీజేపీ విజ‌యం సాధించింద‌ని, అక్క‌డ ఉప ముఖ్య‌మంత్రితో స‌హా 10 మంది మంత్రులు ఓడి పోయార‌ని తెలిపారు.

గోవాలో ప‌లువురు ముఖ్య నేత‌లు ఓడి పోయార‌ని దీని గురించి మాట్లాడ‌క పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు ఎంకే స్టాలిన్MK Stalin ). ఉత్త‌రాఖండ్ లో సీఎం కూడా ఓడి పోయార‌ని ఇది విజ‌యం ఎలా అవుతుందంటూ నిల‌దీశారు.

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు సంబంధించి వాస్త‌వ క్షేత్ర ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే ఇది బీజేపీకి పూర్తిగా ప్ర‌తికూలంగా ఉంద‌ని అన్నారు సీఎం.

ఇక పంజాబ్ లో బీజేపీకి కేవ‌లం రెండు సీట్లతో స‌రి పెట్టుకుంద‌న్నారు. అయితే త‌మిళ‌నాడులో బీజేపీకి అంత సీన్ లేద‌ని పేర్కొనడం విశేషం.

Also Read : ఢిల్లీలో డీఎంకే ఆఫీస్ ప్రారంభం

Leave A Reply

Your Email Id will not be published!