MK Stalin : ప్రతిపక్షాల ఐక్యతకు డీఎంకే మద్దతు
స్పష్టం చేసిన సీఎం ఎంకే స్టాలిన్
MK Stalin : డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ప్రతిపక్షాలను సమన్వయం చేసేందుకు డీఎంకే హృదయ పూర్వకంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు సీఎం. ఆదాయపు పన్ను, సీబీఐ, ఈడీ వంటి వంటి ఏజెన్సీలను ఉపయోగించి ప్రతిపక్షాలను భయ పెట్టేందుకు కేంద్రం యత్నిస్తోందంటూ ధ్వజమెత్తారు స్టాలిన్. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఒకే వేదికపైకి రావల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు సీఎం. జపాన్ లో పర్యటించిన అనంతరం తమిళనాడుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎంకే స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. తన మంత్రివర్గంతో సంబంధం ఉన్న బంధువులు , వ్యక్తులపై ఐటీ సోదాలపై స్పందించారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు గాను సింగపూర్, జపాన్ లలో 9 రోజుల పాటు పర్యటించానని తెలిపారు. భారీ ఎత్తున కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపాయని వెల్లడించారు సీఎం ఎంకే స్టాలిన్.
ఇదిలా ఉండగా జూన్ 1న గురువారం సీఎంతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ , పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్ , భగవంత్ మాన్ రానున్నారు. ప్రతిపక్షాలను సమన్వయం చేయడంలో భాగమేనని పేర్కొన్నారు. మోదీ రాజ దండాన్ని ప్రవేశ పెట్టడంపై కూడా సెటైర్ వేశారు. అది ఆదిలోనే వంగి పోయిందన్నారు ఎంకే స్టాలిన్.
Also Read : Amit Shah
