MK Stalin Modi : కేంద్రంపై భగ్గుమన్న స్టాలిన్
యూసీసీ సర్వ రోగ నివారిణి కాదు
MK Stalin Modi : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) గురించి కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందంటూ ధ్వజమెత్తారు. ఇదే సమయంలో యూసీసీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. యూసీసీ సర్వ రోగ నివారిణి కాదన్నారు సీఎం. ఈ మేరకు లా కమిషన్ కు తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ దేశంలో భిన్నమైన అభిప్రాయాలకు చోటు ఉందన్నారు. కులం, మతం, విద్వేషం ప్రాతిపదికన పాలిటిక్స్ చేయడం మంచి పద్దతి కాదన్నారు ఎంకే స్టాలిన్(MK Stalin).
యూసీసీ వల్ల దేశానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. దీని వల్ల అనేక రకాలైన ఇబ్బందులు ఏర్పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. లా కమిషన్ చైర్ పర్సన్ కు సుదీర్ఘ లేఖ రాశారు. ఉమ్మడి పౌర స్మృతికి తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తాము అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని తెలిపారు ఎంకే స్టాలిన్.
ఏ సమాజమైనా లేదా ఏ ప్రభుత్వమైనా ప్రజల బాగు కోసం పని చేయాలని కానీ కేంద్ర సర్కార్ ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని ధ్వజమెత్తారు. దీనిని తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
Also Read : IND vs WI Ist Test : యశస్వి అరుదైన రికార్డ్