MK Stalin Governor : గవర్నర్ రవిపై స్టాలిన్ కన్నెర్ర
బిల్లుల నిలుపుదలపై ఆగ్రహం
MK Stalin Governor : తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin Governor). ఇప్పటి దాకా రాష్ట్ర సర్కార్ పంపిన బిల్లులపై సంతకం చేయకుండా పెండింగ్ లో ఉంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మనీ బిల్లుకు తాను అనుమతి ఇవ్వలేదని, దానిని తాను నిలుపు కోలేనని గవర్నర్ స్వయంగా అంగీకరించారు. తన ప్రకటనను ఉపసంహరించు కోవడం ద్వారానే ఆర్ ఎన్ రవి తన ప్రమాణానికి కట్టుబడి ఉంటారని స్టాలిన్ పేర్కొన్నారు.
రాష్ట్ర అసెంబ్లీ పంపిన బిల్లులను నిలపుదల చేయడంపై చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఇవి వివాదాస్పదంగా మారాయి. స్టాలిన్ నేతృత్వంలోని రాష్ట్ర సర్కార్ ఇది రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తికి తగదు అంటూ మండిపడ్డారు. నిలిపి వేయడం అంటే తిరస్కరించడం అని అర్థం.
తమిళనాడు సీఎం ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. బిల్లుల ఆమోదాన్ని అనవసరంగా జాప్యం చేయడం గవర్నర్ విధి నిర్వహణతో సమానమని డీఎంకే పేర్కొంది. ఇది పూర్తిగా కక్ష సాధింపు తప్ప మరొకటి కాదన్నారు ఎంకే స్టాలిన్(MK Stalin).
గవర్నర్ ఆర్ఎన్ రవి , తన పరిపాలనా బాధ్యతలు, పాత్రల నుండి తప్పించుకుని, కోట్లాది మంది ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ప్రవేశ పెట్టిన బిల్లులు, ఆర్డినెన్స్ , చట్టం వంటి 14 పత్రాలకు సమ్మతి ఇవ్వలేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు సీఎం ఎంకే స్టాలిన్.
Also Read : జేడీఎస్ చీఫ్ తో ఓవైసీ చర్చలు