MK Stalin : తమిళనాడు (Tamil Nadu) సీఎం ఎంకే స్టాలిన్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు. 10 శాతం ఓటు బ్యాంకు కలిగిన వాళ్లు మూడో కూటమి ఎలా అవుతారంటూ ప్రశ్నించారు బీజేపీని (BJP) ఉద్దేశించి.
మరో వైపు తాను ఢిల్లీకి తాను సాగిల పడ్డానంటూ అన్నాడీఎంకే నేత ఎడపాడి పళనిస్వామి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా తప్పు పట్టారు. పాదాభివందనాలు చేయడం తమ రక్తంలో లేదన్నారు.
యుద్దం చేయడమే తప్ప తలవంచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఎంకే స్టాలిన్(MK Stalin). సీఎం సమక్షంలో ఆదర్శ వివాహం జరిగింది. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు. తమిళనాడు (Tamil Nadu) అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
ప్రభుత్వ సంస్థలను అప్పనంగా అమ్మకానికి పెట్టిన భారతీయ జనతా పార్టీతో (BJP) అంటకాగిన చరిత్ర అన్నాడీఎంకేది కాదా అని నిలదీశారు స్టాలిన్(MK Stalin). లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక, నగర ఎన్నికల్లో విజయంతో డీఎంకే (DMK) కూటమిపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందన్నారు.
పూర్తిగా పారదర్శక పాలన సాగిస్తున్నామని చెప్పారు సీఎం. ఎవరైనా తమ వద్దకు రావచ్చని, తమ సమస్యలు చెప్పు కోవచ్చన్నారు. ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు.
విపక్షాలకు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. కొన ఊపిరి ఉన్నంత వరకు స్టాలిన్ (Stalin) రక్తంలో తలవంచడం లేదన్నారు.
రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి కోరానని దీనిని తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా అన్నారు. ఇదిలా ఉండగా డీఎంకే (DMK) చీఫ్, సీఎం స్టాలిన్ తో కేరళ రాష్ట్ర ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కె. రాధాకృష్ణన్ , తమిళనాడు సీపీఎం నేత బాలకృష్ణన్ లు కలిశారు.
Also Read : కన్నడ నాట కాంగ్రెస్ దే జెండా