MK Stalin : దేశంలో అన్ని రాష్ట్రాలు వేరు తమిళనాడు రాష్ట్రం వేరు. ఎందుకంటే ఆ రాష్ట్రానికి, ప్రత్యేకించి ప్రజలకు స్వంత అభిప్రాయాలు ఉంటాయి. దేశం ఏమై పోతేనేం తమ రాష్ట్రం, తమ ప్రాంతం ముఖ్యమని వారు నమ్ముతారు.
తమకు ఎవరైనా అన్యాయం తలపెట్టినా, లేదా పెట్టేందుకు యత్నించినా ఊరుకోరు. తల వంచే దాకా పోరాటం చేస్తారు. అవసరమైతే ప్రాణాలు కూడా తీసుకుంటారు. ఏ ప్రభుత్వమైనా రాని రాజకీయాల వరకు వచ్చే సరికల్లా ఎవరి అభిప్రాయాలు వారివి.
కానీ రాష్ట్ర ప్రయోజనాల వరకు వచ్చే సరికల్లా అన్ని పార్టీలే కాదు నేతలు, ప్రజలందరి ఆలోచనలు ఒక్కటే. తాజాగా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకు వచ్చింది.
అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఆదేశించింది. దీనిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) కన్నెర్ర చేశారు. డోంట్ కేర్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ అసాధారణ నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా తమ రాష్ట్రానికి సంబంధించి సొంతంగా విద్యా విధానం రూపొందించేందుకు సీఎం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. హిందీ వ్యతిరేక ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిన తమిళనాడులో మొదటి నుంచి ఎనీఈపీని వ్యతిరేకిస్తూ వస్తోంది.
తమ రాష్ట్రంలో హిందీని బలవంతంగా రుద్దేందుకు యోచిస్తోందంటూ ఆరోపిస్తోంది సర్కార్. దీంతో సొంత విద్యా విధానం అమలు చేసేందుకు గాను స్టాలిన్ 13 మందితో కమిటీని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం స్టాలిన్ తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. కేంద్రంపై సీరియస్ అయ్యారు తమిళనాడు సీఎం.
Also Read : భారత్ లో గోధుమలకు ఢోకా లేదు