MK Stalin Tribute : నిజమైన ప్రజా నేత ఊమెన్ చాందీ
నివాళులు అర్పించిన సీఎం స్టాలిన్
MK Stalin Tribute : జీవితాంతం ప్రజల కోసం పని చేసిన అరుదైన నాయకుడు కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ అని కొనియాడారు తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్. మంగళవారం అనారోగ్యంతో చికిత్స పొందుతూ బెంగళూరులో కన్నుమూశారు. ప్రజా సేవలో చివరి దాకా ఉన్నారని పేర్కొన్నారు. ఆయన మృతి కేరళ రాష్ట్రానికే కాదు యావత్ దేశానికి తీరని నష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం. ఈ విషాద సమయంలో కేరళ ప్రజలకు , ఆయన కుటుంబీలకు ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నానని పేర్కొన్నారు ఎంకే స్టాలిన్(MK Stalin).
MK Stalin Tribute To
ఇదిలా ఉండగా రెండుసార్లు కేరళ రాష్ట్రానికి సీఎంగా పని చేశారు. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలలో ఉన్నారు. దాదాపు 50 ఏళ్ల పాటు ప్రజా జీవితంలోనే గడిపారు. ఆయనకు రాష్ట్రంలో అజాత శత్రువు అని పేరుంది. పార్టీలు వేరైనా , భావజాలాలు వేరైనా సరే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించే వారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు సీపీఎంకు చెందిన కేరళ సీఎం పినరయ్ విజయన్.
ఇద్దరం ఒకే సారి పాలిటిక్స్ లోకి అడుగు పెట్టాం. 11 సార్లు ప్రజా ప్రతినిధిగా గెలుపొందారు. వివిధ హోదాలలో పని చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఎక్కడ ఉన్నా తనను తాను మార్చుకుంటూనే ప్రజా సేవకు జీవితాన్ని అంకితం చేశారంటూ కొనియాడారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
Also Read : Bro The Warrior Movie : 28న రానున్న పవన్ ..తేజ్ ‘బ్రో’
