MK Stalin : కేంద్ర సర్కార్ పై స్టాలిన్ సీరియస్
దేశంలో హిందీ మాట్లాడే వారే ఎక్కువ
MK Stalin : గత కొంత కాలం నుంచీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. భాష పేరుతో పెత్తనం చెలాయించాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే హెచ్చరించారు.
ఇదిలా ఉండగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ దేశ వ్యాప్తంగా హిందీ భాషను అమలు చేయాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు తక్షణమే ఆమోదించాలని కోరుతూ దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది.
ఆమె కంటి ఆపరేషన్ కోసం ఆర్మీ ఆస్పత్రికి వెళ్లే పనిలో బిజీగా ఉండడంతో ఇది కొంత ఆలస్యం జరిగింది. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి, పవర్ లోకి వచ్చిన నాటి నుంచి ఒకే నినాదం వినిపిస్తోంది.
అదేమిటంటే ఒకే దేశం ఒకే మతం ఒకే జాతి ఒకే భాష ఒకే పార్టీ ఉండాలనే దిశగా పావులు కదుపుతోంది. దీనిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తాజాగా హిందీ భాష అమలును తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు స్టాలిన్.
దేశంలో హిందీ మాట్లాడే వారి కన్నా మాట్లాడని వారే ఎక్కువగా ఉన్నారని , ప్రతి భాషకు ప్రత్యేకత ఉందన్నారు. ఇతర భాషలు మాట్లాడే వారిపై ప్రత్యేకంగా హిందీనే మాట్లాడాలని రుద్దడం మంచి పద్దతి కాదన్నారు స్టాలిన్(MK Stalin).
దీనిని ఏ రాష్ట్రం ఒప్పుకోదన్నారు. మోదీ కావాలని నివేదిక ఇచ్చారని దీనిని ఎవరూ ఒప్పుకోరని స్పష్టం చేశారు తమిళనాడు సీఎం.
Also Read : డిజిటలైజేషన్ తో సామాజిక భద్రత – మోదీ