MK Stalin : హిందీని ఒప్పుకోం కేంద్రంపై యుద్దం – స్టాలిన్
దేశ మంతటా వ్యతిరేక ప్రచారం ముమ్మరం
MK Stalin : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానల్ హిందీని తప్పనిసరి చేయాలని సిఫార్సు చేయడం, ఇందుకు సంబంధించి నివేదికను రాష్ట్రపతికి అందజేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఆయన ముందు నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
హిందీ ఏనాడూ రాజ భాష కాదని పేర్కొన్నారు. తమపై కావాలని హిందీని రుద్దాలని ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు సీఎం. కేంద్రం హిందీ తప్పనిసరి ప్రయోగానికి వ్యతిరేకంగా ఇవాల్టి నుంచే డీఎంకే ఆధ్వర్యంలో నిరసన ప్రారంభించనుందని స్పష్టం చేశారు స్టాలిన్(MK Stalin).
ఇందుకు సంబంధించి అక్టోబర్ 15న తమిళనాడు అంతటా నిరసనలు చేపట్టాలని డీఎంకే ప్లాన్ చేసింది. కేంద్రీయ విద్యా సంస్థల్లో హిందీని బోధనా మాధ్యమంగా మార్చాలన్న పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సుకు వ్యతిరేకంగా తమిళనాడులో అధికార డిఎంకే , విద్యార్థి విభాగం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాలని ప్రకటించింది. ఇందుకు ప్రభుత్వం నుంచి కూడా పూర్తి మద్దతు ఉందని వెల్లడించింది.
ద్రవిడ మున్నేట్ర కజగం యూత్ వింగ్ కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్(MK Stalin) , స్టూడెంట్ వింగ్ కార్యదర్శి ఎజిలరసన్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ హిందీ విధానానికి వ్యతిరేకంగా నిరసన తెలియ చేస్తున్నట్లు వెల్లడించారు. తాము ఎట్టి పరిస్థితుల్లో హిందీని ఒప్పుకోమని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా హిందీ భాషకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించిన చరిత్ర డీఎంకేకు ఉంది తమిళనాడులో. ప్రధానంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడిన విషయాన్ని కేంద్రం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు ఎంకే స్టాలిన్.
Also Read : సెక్షన్ 66ఎ కింద విచారణ చెల్లదు