Akhil Gogoi NIA : మాయివోస్టులకు ఎమ్మెల్యే గొగోయ్ అండ
కోర్టుకు తెలిపిన ఎన్ఐ సంస్థ
Akhil Gogoi NIA : రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలకు అసోం ఎమ్మెల్యే గొగోయ్ కింగ్ పిన్ గా ఉన్నారంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సంచలన ఆరోపణలు చేసింది. గొగోయ్(Akhil Gogoi NIA) అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు మార్చి 3 వరకు పొడిగించింది ధర్మాసనం.
న్యాయమూర్తులు వి. రామసుబ్రమణియన్ , జస్టిస్ పంకజజ్ మిథాల్ లతో కూడిన బెంచ్ దీనిపై శుక్రవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. సిఎఎ వ్యతిరేక నిరసనలకు సంబంధించి గొగోయ్ పై రెండు కేసులు నమోదు చేసింది. వీటిపై ఎన్ఐఏ(NIA) దర్యాప్తు చేస్తోంది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్ఐఏ. అస్సాం ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలకు కింగ్ పిన్ గా ఉన్నారని ఆరోపించింది. అందు వల్ల అతడికి బెయిల్ మంజూరు చేయలేమంటూ జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఇదిలా ఉండగా డిసెంబర్ 2019లో అస్సాంలో పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనల సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా గళం విప్పారు అఖిల్ గొగోయ్(Akhil Gogoi).
ఫిబ్రవరి 9న గౌహతి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతడిపై ఉన్న రెండు కేసుల్లో ఒక దానిలో అభియోగాల రూపకల్పనను కోర్టు కొనసాగించింది. గొగోయ్ తరపున వాదించారు హుజెఫా అహ్మదీ. రాజకీయ ప్రతీకారానికి పెద్దపీట వేస్తున్నారని వాదించారు.
గొగోయ్ ఒక రాజకీయ నాయకుడు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతినిధి. ఆయన ఒక నిర్దిష్ట రాజకీయ విభాగాన్ని వ్యతిరేకిస్తున్నాడు. అందుకే వాళ్లు అతడిని జైళ్లో పెట్టాలని అనుకుంటున్నారని తెలిపారు.
Also Read : సిసోడియాకు 5 రోజుల కస్టడీ