ER Eswaran : ప్రధానమంత్రి మోదీపై నిప్పులు చెరిగారు కొంగునాడు మక్కల్ దేశియా కట్చి (కేఎండీకే) పార్టీ ప్రధాన కార్యదర్శి , తిరుచెంగోడు ఎమ్మెల్యే ఇఆర్ ఈశ్వరన్. మంగళవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. విపక్షాల కీలక భేటీకి హాజరయ్యారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
మోదీ ప్రధానిగా కొలువు తీరి 10 ఏళ్లవుతోంది. ఇవాళ దేశం అత్యంత ప్రమాదకరమైన స్థితిలో కొట్టు మిట్టాడుతోందన్నారు ఈశ్వరన్(ER Eswaran). అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి కేవలం ఒకే ఒక్క వ్యవస్థను తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
ER Eswaran
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది అత్యంత బలమైనదని కానీ దానిని కూడా నిర్వీర్యం చేసే పనిలో పడ్డారంటూ మండిపడ్డారు. ఇవాళ ఒకే భాష, ఒకే దేశం, ఒకే జాతి ఉండాలని బీజేపీ హిందుత్వ ఎజెండాను రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. దీనిని ప్రజలు ఎంత మాత్రం ఒప్పుకోరని స్పష్టం చేశారు ఈశ్వరన్. తమ భేటీ అత్యంత కీలకమైనదని, రాబోయే ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు .
దేశం క్లిష్టమైన కూడలిలో ఉంది. దేశాన్ని రక్షించు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ విపత్కర సమయంలో కీలక సమావేశం జరగడం మంచిదన్నారు. తోటి పౌరుల హక్కులు హరించకుండా చూడాలన్నారు ఈశ్వరన్. పౌరుల హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం నెలకొని ఉందన్నారు ఈశ్వరన్.
Also Read : Sitaram Yechuri : దేశం ప్రమాదంలో ఉంది – ఏచూరి