Gampa Govardhan KCR : కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ
ఎమ్మెల్యే గంప గోవర్దన్ కామెంట్
Gampa Govardhan KCR : కామారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్దన్ సంచలన ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ పోటీ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి నుంచే కేసీఆర్ పోటీ చేస్తారని అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు అటు పార్టీలోనూ ఇటు విపక్షాలలో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ వంద శాతం కామారెడ్డి నుంచే రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగుతారంటూ ప్రకటించారు గంప గోవర్దన్.
Gampa Govardhan KCR Words
ఎందుకంటే తాను ఇప్పటికీ కేసీఆర్ ను కలిసిన ప్రతి సందర్భంలోనూ కామా రెడ్డి నుంచే పోటీ చేయాలని కోరినట్లు చెప్పారు. ఆదివారం గంప గోవర్దన్(Gampa Govardhan) మీడియాతో మాట్లాడారు. తాను కేసీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటానని కుండ బద్దలు కొట్టారు. ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణం కేసీఆర్ అని కొనియాడారు. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ అత్త గారి ఊరు కామారెడ్డి నియోజకవర్గంలోని కోనాపూర్.
ఈ సంవత్సరంలోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ చేసిన తాజా ప్రకటన మరింత బలం చేకూర్చినట్లయింది. కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఎవరూ చెప్పలేరు. మరో వైపు ప్రతిపక్షాలు సైతం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ , బీఆర్ఎస్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ, బీఎస్పీ పార్టీలు యుద్ద రంగానికి సన్నద్దం అవుతున్నాయి.
Also Read : KC Venu Gopal : కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కేసీ ఫోకస్