Jagga Reddy : క‌విత‌..బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలి

కాంగ్రెస్ అగ్ర నేత జ‌గ్గారెడ్డి డిమాండ్

Jagga Reddy : కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు జ‌గ్గా రెడ్డి(Jagga Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం కూతురు , ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌తో పాటు బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్ ను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. గాంధీ భ‌వ‌న్ లో శుక్ర‌వారం జ‌గ్గా రెడ్డి మీడియాతో మాట్లాడారు.

లిక్క‌ర్ స్కాంలో క‌విత‌, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ ల పేర్లు బ‌య‌ట ప‌డ్డాయ‌ని ఆరోపించారు. కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్ర‌భుత్వం సంతోష్ ను కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. ఇందులో భాగంగానే క‌విత‌ను టార్గెట్ చేయ‌డం , అరెస్ట్ చేయడం ఖాయ‌మ‌న్నారు.

నిన్న‌టి దాకా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒక్క‌టేన‌ని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు గేమ్ ప్లాన్ లో భాగంగా నాట‌కాలు ఆడుతున్నాయంటూ ఎద్దేవా చేశారు. షార్ట్ క‌ట్ లో త‌మ పార్టీని అణగ దొక్కాల‌ని సంతోష్ య‌త్నిస్తున్నారంటూ ఆరోపించారు జ‌గ్గారెడ్డి(Jagga Reddy). గ‌త కొంత కాలంగా క‌విత‌, సంతోష్ లు మీడియాను ఆక్ర‌మించుకున్నార‌ని మండిప‌డ్డారు.

రాష్ట్రంలో ప్ర‌భుత్వం పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలి వేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా వైఎస్ ష‌ర్మిల దేని కోసం మాట్లాడుతుందో అర్థం కావ‌డం లేద‌న్నారు. ఆమె సంగ‌తి త‌ర్వాత చెబుతానంటూ హెచ్చ‌రించారు. ఏపీలో స‌మస్య‌లు లేవా ఇక్క‌డ మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు.

రైతులు, మ‌హిళ‌లు, యువ‌త స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు. వెంట‌నే క‌విత‌, బీఎల్ సంతోష్ ల‌ను అరెస్ట్ చేయ‌క పోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేప‌డ‌తామ‌న్నారు.

Also Read : ప‌వ‌ర్ లోకి వ‌స్తా అంద‌రినీ ఆదుకుంటా

Leave A Reply

Your Email Id will not be published!