MLA Jagga Reddy : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు , సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి(MLA Jagga Reddy) సంచలన కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న విషయాలు, పార్టీ పరిస్థితిపై ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి పూర్తిగా వివరిస్తానని చెప్పారు జగ్గారెడ్డి. గత కొంత కాలంగా పార్టీ బలోపేతం కోసం తాను పని చేస్తున్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఒక రకంగా ప్రస్తుత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు పార్టీలో ఏం జరుగుతుందో తనకే అర్థం కావడం లేదని పేర్కొన్నారు. గతంలో ఒకలా ఉండేదని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ మరోలాగా కనిపిస్తోందని వాపోయారు. ఇదిలా ఉండగా జగ్గారెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. తాజాగా సమీకరణలు మారుతున్నాయి పార్టీలో.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్ లో చేరారు. ఈ తరుణంలో నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు పార్టీలో చేరాల్సి ఉండగా వాళ్లు రాలేదు. ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం దూరంగా ఉండడం, ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
పార్టీ హై కమాండ్ తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా సరే భారత రాష్ట్ర సమితిని ఓడించాలని కంకణం కట్టుకుంది. ఇదే సమయంలో కర్ణాటకలో బీజేపీ పవర్ ను కోల్పోవడం కూడా కాంగ్ఎస్ పార్టీలో ఆశలు పెంచింది.
Also Read : PV Sunil Kumar Jagan : సీఎంతో డీజీ సునీల్ కుమార్ భేటీ
