MLA Jagga Reddy : బీఆర్ఎస్ అంతా బక్వాస్ – జగ్గారెడ్డి
పాలన పడేకిసందని ఆరోపణ
MLA Jagga Reddy : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు , ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ వల్ల తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ఇక ఉన్న దానిని మార్చి కొత్త పేరు బీఆర్ఎస్ పేరు పెట్టినా దేశానికి ఒనగూరేది ఏమీ ఉండదంటూ ఎద్దేవా చేశారు జగ్గారెడ్డి(MLA Jagga Reddy). రాను రాను తెలంగాణ సెంటిమెంట్ అనేది లేకుండా చేయాలనే ఇలా కేసీఆర్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ప్రజలు దెబ్బ కొట్టడం ఖాయమన్నారు. సొల్లు కబుర్లతో పాలన సాగిస్తున్న సీఎంకు పాలించే నైతిక హక్కు లేదన్నారు. ముందస్తు ప్లాన్ తోనే నాటకాలు ఆడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ఆఫీసులు ఎన్ని పెట్టుకున్నా తమకు, పార్టీకి అభ్యంతరం లేదన్నారు. ప్రజలకు మెరుగైన పాలన ఇవ్వలేని సీఎం దేశాన్ని ఎలా ఏలుతాడో ఆలోచించు కోవాలని సూచించారు జగ్గారెడ్డి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) ప్రభావం ఎంత మాత్రం ఉండదన్నారు. కేసీఆర్ కు అంత సీన్ లేదన్నారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వడంలో కేసీఆర్ ఆరి తేరాడని ఎద్దేవా చేశారు. ఈరోజు వరకు యాక్షన్ ప్లాన్ ప్రకటించ లేదన్నారు. ప్రచార ఆర్భాటం తప్ప తెలంగాణకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి(MLA Jagga Reddy).
ఇదే సమయంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రభావం కొంత మేరకు ఉండ వచ్చని అభిప్రాయ పడ్డారు. రాబోయే బడ్జెట్ లో మైనార్టీ కార్పొరేషన్ కు రూ. 1500 కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : టీడీపీకి అంత సీన్ లేదు – బొత్స