MLA Jagga Reddy : దుష్ప్రచారం చేస్తే ఊరుకోను – జగ్గారెడ్డి
బట్టలు ఊడ దీసి కొడతానని వార్నింగ్
MLA Jagga Reddy : సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. తాను ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు. కొందరు కావాలని తనను వెళ్లి పోతున్నానంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కావాలని టార్గెట్ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
MLA Jagga Reddy Slams Media
తనను ఇబ్బంది పెట్టేలా చేస్తున్న వారు ఎవరో తనకు తెలుసన్నారు. సమయం వచ్చినప్పుడు వాళ్ల సంగతి తేలుస్తానని అన్నారు జగ్గారెడ్డి(MLA Jagga Reddy). ప్రత్యేకించి తెలుగు మీడియా తనను పదే పదే ఇబ్బందులకు గురి చేసేలా పార్టీ మారుతున్నాడంటూ ప్రచారం చేస్తోందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు ఎమ్మెల్యే.
మీడియాకు కూడా కొన్ని పద్దతులు ఉంటాయని స్పష్టం చేశారు. ఎవరి పరిమితుల్లో వారుంటే బెటర్ అని పేర్కొన్నారు. పార్టీ మారుతున్నట్లు తాను ఎక్కడా చెప్పలేదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు జగ్గా రెడ్డి.
భారత్ జోడో యాత్ర సందర్బంగా తాను చేసిన ఏర్పాట్లను చూసి ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ ఇంప్రెస్ అయ్యారని తెలిపారు. దుష్ప్రచారం చేస్తే గనుక బట్టలు ఊడదీసి ఉరికించి కొడతానని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే
Also Read : CM Indira Canteens : కొత్తగా 188 ఇందిరా క్యాంటీన్లు – సీఎం