MLA Jeevan Reddy : సీఎం ఆశీర్వాదం జీవన్ రెడ్డి సంతోషం
కేసీఆర్ ప్రకటించిన జాబితాలో చోటు
MLA Jeevan Reddy : మోస్ట్ డైనమిక్ లీడర్ గా పేరు పొందిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరోసారి టికెట్ దక్కింది. సీఎం కేసీఆర్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నిన్న ప్రగతి భవన్ సాక్షిగా మొత్తం 115 మంది అభ్యర్థులను ఖరారు చేశారు.
మంగళవారం స్వయంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనతో పాటు మహబూబ్ నగర్ కు చెందిన మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ కూడా సీఎంను కలిశారు. ధన్యవాదాలు తెలిపారు.
MLA Jeevan Reddy Thanks to KCR
ఇదిలా ఉండగా జీవన్ రెడ్డి పూర్తి పేరు ఆశన్నగారి జీవన్ రెడ్డి. మంచి వక్త. ఎల్ఎల్బీ చేసిన ఆయన న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేశారు. పార్టీ తరపున వాయిస్ వినిపిస్తూ వచ్చారు. ఆర్మూర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మార్చి 7, 1976లో పుట్టారు. పేరొందిన నాయకుడిగా, న్యాయ వాదిగా , వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు ఆశన్నగారి జీవన్ రెడ్డి(MLA Jeevan Reddy). తండ్రి వెంకట రాజన్న కాంగ్రెస్ తరపున జంకం పేట్ గ్రామ ఉప సర్పంచ్ గా పని చేశారు. మామ ఎల్ల రాములు ఇదే పార్టీ నుంచి ఆర్మూర్ ఎంపీపీగా ఉన్నారు.
ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ జీవన్ రెడ్డికి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు దిశా నిర్దేశం చేశారు. ఎలాగైనా సరే పెద్ద ఎత్తున విజయం సాధించి తన ముందుకు రావాలని సూచించారు. తనకు ఆ నమ్మకం ఉందన్నారు కేసీఆర్.
Also Read : Bandi Sanjay : టీటీడీ చైర్మన్ గా భూమున అనర్హుడు