Karanam Dharmasri : వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా
జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్ కు లేఖ
Karanam Dharmasri : అధికార పార్టీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ(Karanam Dharmasri) సంచలన ప్రకటన చేశారు. ఆ మేరకు ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ప్రకటించిన విధంగా మూడు రాజధానులు చేయాలని కోరుతూ డిమాండ్ చేశారు. ఈ మేరకు దానిని ప్రకటించేంత వరకు తాను ఎమ్మెల్యేగా ఉండనని వెల్లడించారు.
ఇందులో భాగంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు కరణం ధర్మశ్రీ. ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ధర్మశ్రీ. తాము ఇప్పటికీ ఇదే విషయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే కరణం.
ఇదిలా ఉండగా మూడు రాజధానులు, పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖపట్నంలో జాయింట్ యాక్షన్ కమిటీ (సంయుక్త కార్యాచరణ కమిటీ ) ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. జేఏసీ కన్వీనర్ లజపతి రాయ్ కు ఎమ్మెల్యే స్వంతంగా తన రాజీనామా లేఖను అందజేశారు. ప్రస్తుతం కరణం ధర్మశ్రీ చేసిన ప్రకటన ఏపీలో కలకలం రేపింది. ఈ విషయంపై సీఎం జగన్ ఆరా తీశారు.
ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కు సవాల్ విసిరారు. మూడు రాజధానులపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలన్నారు. రాష్ట్రానికి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖకు మద్దతుగా జేఏసీ మెగా ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ జేఏసీకి మాజీ వీసీ లజపతి రాయ్ కన్వీనర్ గా ఉన్నారు.
Also Read : త్వరలో నైపుణ్య శిక్షణ కేంద్రం స్టార్ట్