Raghunandan Rao : నిన్న ధిక్కారం నేడు మారిన స్వరం
నేను అలా అనలేదంటున్న రఘునందన్
Raghunandan Rao : దుబ్బాక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న పార్టీపై ధిక్కార స్వరం వినిపించిన ఆయన ఉన్నట్టుండి ఏమైందో ఏమో కానీ మాట మార్చారు. తాను అలా అనలేదంటూ పేర్కొన్నారు. కేవలం చిట్ చాట్ సందర్భంగా మాట్లాడానని దానిని సీరియస్ గా తీసుకుని ప్రసారం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. తాను నిజాయితీ కలిగిన కార్యకర్తనని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాలుగా తాను పార్టీ కోసం పని చేశానంటూ చెప్పారు.
ఒకప్పుడు కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు భార్య పుస్తలమ్మిన భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్ కి ఇవాళ రూ.100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆపై పార్టీ అధ్యక్షుడిగా లేదా జాతీయ అధికార ప్రతినిధి, కాదంటే అసెంబ్లీలో పార్టీ ఫ్లోర్ లీడర్ గా నియమించాలని బీజేపీ హైకమాండ్ కు ఏకంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆపై ఏమైందో ఏమో కానీ రఘునందన్ రావు(Raghunandan Rao) మాట మార్చాడు.
తాను అలా అనలేదని, ఏదో సరదాకు అన్న మాటల్ని కావాలని వక్రీకరించారంటూ ఆరోపించాడు. నిత్యం మాటల తూటాలు పేల్చే దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నట్టుండి మాట మార్చడం ప్రతి ఒక్కరిని విస్తు పోయేలా చేసింది.
మరో వైపు బీజేపీ హైకమాండ్ కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ని మార్చేసి కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వనుంది. ఇదే క్రమంలో ఈటల రాజేందర్ కు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించనున్నట్లు టాక్.
Also Read : Ajit Pawar VS Shinde : అజిత్ కు ఛాన్స్ షిండేకు షాక్
