MLA Raja Singh : వచ్చే అసెంబ్లీలో నేను ఉండను
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్
MLA Raja Singh : భారతీయ జనతా పార్టీ గోషా మహల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ శాసన సభలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటారో తనకు తెలియదన్నారు. కానీ తాను మాత్రం ఈ అసెంబ్లీలో ఉండనని స్పష్టం చేశారు.
MLA Raja Singh Comments
ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి పార్టీలో. ఇప్పటికే రెబల్ క్యాండిడేట్ గా ముద్ర పడ్డారు రాజా సింగ్(Raja Singh). ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఏకంగా పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయడం విస్తు పోయేలా చేసింది. చివరకు సస్పెన్షన్ వేటు ఎత్తి వేశారు.
హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేలా కామెంట్స్ చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతే కాదు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయడం సంచలనం కలిగించింది. భారత దేశంలో పీడీ కేసు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
బీజేపీలో ఫ్లోర్ లీడర్ కావాల్సిన రాజా సింగ్ పూర్తిగా వివాదాస్పద వ్యాఖ్యలతో తన పొలిటికల్ కెరీర్ ను మరింత క్లిష్టతరంగా చేసుకున్నారు.
Also Read : KTR Tribute : జయశంకర్ సారు జీవితం ఆదర్శప్రాయం