MLA Raja Singh : అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకరైతే నేను రాను
షాకింగ్ కామెంట్స్ చేసిన రాజా సింగ్
MLA Raja Singh : హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీకి చెందిన గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
MLA Raja Singh Comment
ఇందులో భాగంగా కొత్తగా ఎన్నికైన 119 మంది సభ్యులతో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం పార్టీకి చెందిన అక్బరుద్దీన్ ఓవైసీని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.
దీంతో తాను అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్ గా ఉంటే తాను అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజా సింగ్(MLA Raja Singh). రెగ్యులర్ స్పీకర్ వచ్చాక , బాధ్యతలు స్వీకరించాక తాను శాసన సభకు వస్తానని, అప్పుడే అడుగు పెడతానని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన గడ్డం ప్రసాద్ ను స్పీకర్ గా నియమించారు సీఎం. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ప్రమాణం చేశాక ప్రసాద్ కొలువు తీరనున్నారు. ఇదిలా ఉండగా కొత్తగా శాసన సభ రేపు ప్రారంభం కానుంది. అయితే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Revanth Reddy : ఇక నుంచి ప్రజా దర్బార్ కట్టుదిట్టం