MLA Raja Singh : రాజా సింగ్ ఆయుధ పూజ
తుపాకులు, కత్తులకు పూజలు
MLA Raja Singh : హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీకి చెందిన గోషా మహల్ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ వైరల్ గా మారారు. దసరా పండుగను పురస్కరించుకుని ఆయన తన ఇంట్లో ఉన్న ఆయుధాలకు పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న రాజా సింగ్ భారీ ఆయుధాలు , కత్తులు, కటార్లు కలిగి ఉండడం విస్తు పోయేలా చేసింది. అయితే తన ప్రాణానికి ముప్పు ఉందని ,అందుకే తాను ముందస్తుగా అనుమతి తీసుకుని వీటిని తన వద్ద ఉంచుకున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే రాజా సింగ్.
MLA Raja Singh Pooja
ముస్లింలపై సంచలన కామెంట్స్ చేశారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారిగా బీజేపీ ఎమ్మెల్యేపై పీడీ యాక్డు కింద కేసు నమోదు చేసింది. దీనిని ఆసరాగా చేసుకుని భారతీయ జనతా పార్టీ హై కమాండ్ రాజా సింగ్(MLA Raja Singh) కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆయనపై ఏడాది పాటు నిషేధం విధించింది.
తాజాగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మనసు మార్చుకుంది బీజేపీ. రాజా సింగ్ పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తి వేస్తున్నట్లు బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని స్వయంగా వెల్లడించారు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. నిషేధం తొలగించడంతో రాజా సింగ్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
Also Read : SA vs BAN World Cup : డికాక్ జోర్దార్ సఫారీ షాన్ దార్