CM KCR : త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో స్టేషన్ ఘణపూర్ లో చోటు చేసుకున్న నేతల మధ్య వివాదం తలనొప్పిగా మారింది భారత రాష్ట్ర సమితి పార్టీకి. దీంతో వెంటనే ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మాజీ డిప్యూటీ సీఎం , ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఆధిపత్య పోరు చివరకు వ్యక్తిగతంగా తిట్టుకునేంత స్థాయికి చేరింది.
పతాక స్థాయికి చేరిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య చోటు చేసుకున్న విభేదాలపై ఆరా తీసింది హై కమాండ్. ఈ మేరకు ఇద్దరు నేతలు రావాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. ముందుగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సీఎం కేసీఆర్(CM KCR) వద్దకు బయలు దేరారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం కేసీఆర్ కు వివరించనున్నారు రాజయ్య.
మరో వైపు ఆదర్శ ప్రాయంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు ఇలా వ్యక్తిగతంగా , కుటుంబ స్థాయికి విమర్శించుకునేలా ఎందుకు దిగజారారో అంటూ పెద్ద ఎత్తున స్టేషన్ ఘన్ పూర్ లో ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఒకప్పుడు చిల్లి గవ్వ లేని కడియం శ్రీహరి ఇంట్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం కులం ఎస్సీ కాదంటూ ఆరోపించారు. దీనిపై కడియం షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజయ్య కుటుంబం గురించి చెబితే ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Also Read : BRS Slams : రేవంత్ రెడ్డి కామెంట్స్ బీఆర్ఎస్ సీరియస్
