MLA Rajaiah : నాకే సీటు పక్కా – రాజయ్య
మార్పులు చేర్పులలో నిర్ణయం
MLA Rajaiah : స్టేషన్ ఘనపూర్ – బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి తన టికెట్ విషయంలో కీలక ప్రకటన చేశారు. దేశమంతా వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరగబోతోందంటూ జోష్యం చెప్పారు. ఆపై తెలంగాణలో శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చ్ నెలలో జరుగుతాయని అంచనా వేశారు.
MLA Rajaiah Comments
దీంతో మార్పులు చేర్పులు ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ , పార్టీ బాస్ తప్పకుండా తనకు టికెట్ కేటాయిస్తారంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ పరంగా 119 సీట్లకు గాను అన్ని పార్టీల కంటే ముందే కేసీఆర్ 115 మంది సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు.
ఇందులో 7 సీట్లకు ఇంకా అభ్యర్థులను ప్రకటించ లేదు. వివిధ కారణాల రీత్యా వారికి సీట్లు ఇవ్వడం కుదరలేదని స్పష్టం చేశారు కేసీఆర్. ప్రకటించని అభ్యర్థులలో స్టేషన్ ఘనపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(MLA Rajaiah) కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తనకు టికెట్ కేటాయించక పోవడంతో ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. అంతకు ముందు మంత్రిగా ఉన్నారు. లైంగిక ఆరోపణలు, మానసిక వేధింపులకు పాల్పడ్డారంటూ తాటికొండ రాజయ్యపై ఆరోపణలు వచ్చాయి. ఆనాడు కేబినెట్ నుంచి తొలగించారు. తాజాగా ఇదే నియోజకవర్గానికి చెందిన సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేసింది. రాజయ్య తనను వేధిస్తున్నాడంటూ ఆరోపించింది.
Also Read : Renuka Chowdhury : షర్మిల ఏమైనా పాలేరులో పుట్టిందా