MLA Seethakka : వరద బాధితులను ఆదుకోండి
ములుగు ఎమ్మెల్యే సీతక్క
MLA Seethakka : అకాల వర్షాల దెబ్బకు తమ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. 15 కుటుంబ సభ్యులను కోల్పోయామని వాపోయారు. చాలా మంది ఇళ్లను కోల్పోయారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు దాసరి సీతక్క.
MLA Seethakka Request
తెలంగాణ శాసనసభా సమావేశాలలో ఎమ్మెల్యే మాట్లాడారు. తాజాగా చోటు చేసుకున్న వరద ప్రభావిత నష్టం గురించి ఏకరువు పెట్టారు. అకాల వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకుందని పేర్కొన్నారు. తమ నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాలలో వరదల కారణంగా అన్నీ కోల్పోయి నిరాశ్రయులైన వారికి భరోసా ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను కోరారు ఎమ్మెల్యే సీతక్క(MLA Seethakka).
సర్వస్వం కోల్పోయిన వాళ్లు చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు. వ్యవసాయ పొలాలు ఇసుకతో నిండి పోయాయని కన్నీటి పర్యంతం అయ్యారు. ఇటీవలి ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకుని బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు ఎమ్మెల్యే దాసరి సీతక్క.
మరో వైపు వరద కారణంగా నష్ట పోయిన వారికి యుద్ద ప్రాతిపదికన పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రూ. 500 కోట్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ నిధులతో బాధితులకు పరిహారం, రోడ్ల మరమ్మత్తులు చేపట్టనున్నారు.
Also Read : Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.74 కోట్లు