MLA Seethakka : ‘హర్ట్’ అయిన రాజీనామా చేసిన – సీతక్క
పార్టీ కోసం పని చేసేందుకు సిద్దంగా ఉన్నా
MLA Seethakka : ములుగు ఎమ్మెల్యే సీతక్క మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. పదే పదే తమను వలస వాదులంటూ దెప్పి పొడిచే ప్రయత్నం చేస్తున్నరు. అందుకే బాధ పడిన. ఈ పదవులు ఎందుకు అనుకుని రాజీనామా చేసిన అని అన్నారు.
తనకు ఎమ్మెల్యే పదవి ఉందని, ప్రజలు తన పట్ల ఇప్పటికీ ప్రేమ కనబరుస్తూ ఉన్నారని చెప్పారు. గాంధీ భవన్ లో ఇవాళ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ తో కలిశారు. అనంతరం ఆమె బయటకు వచ్చాక మాట్లాడారు. లోపట జరిగే విషయాల గురించి బయటకు చెప్పలేమన్నారు.
ప్రతి పార్టీకి కొన్ని నియమాలు అనేవి ఉంటాయని, వాటిని అతిక్రమించడం మంచి పద్దతి కాదన్నారు. మొన్న సీనియర్ నాయకులు చేసిన వ్యాఖ్యలతో తాను అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత కాలం సేవ చేస్తూనే ఉంటానని అన్నారు. పని చేస్తే పదవులు వస్తాయని, కానీ పైరవీలు చేస్తే రావన్నారు.
తనను టీడీపీ నుంచి వచ్చినవని అంటున్నారు. చాలా ఏళ్లయింది వచ్చి. కానీ తాను వచ్చిన నాటి నుంచి పీసీసీ చీఫ్ ఏం చెబితే దానిని చేసుకుంటూ పోయిన అని అన్నారు ఎమ్మెల్యే సీతక్క(MLA Seethakka). కరోనా కష్ట కాలంలో తాను ఎలా పని చేశానో మీకందరికీ తెలుసన్నారు.
తనను రేవంత్ రెడ్డి మనిషంటూ పదే పదే కామెంట్ చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఏది ఏమైనా పార్టీలో అంతా సర్దుకుంటుందన్నారు. ఆ నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే అనిల్ పై దాడి చేసేందుకు కొందరు ప్రయత్నించడం కలకలం రేపింది.
Also Read : కేసీఆర్ కు మొక్కిండు క్రీస్తు జపం చేస్తుండు