MLA Seethakka : ములుగు ఎమ్మెల్యే సీతక్క నిప్పులు చెరిగారు. ఉచిత విద్యుత్ పేరుతో సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నాడని ఆరోపించారు. 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్నానని చెప్పి వేల కోట్ల అప్పులు చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతుల పట్ల ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. కేవలం నిరంతరం సరఫరా చేయడం వల్ల కరెంట్ మోటార్లు, విద్యుత్ స్టార్టర్లు కాలి పోతున్నాయని చెప్పారని తెలిపారు. 12 గంటల పాటు కనీసం నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం లేదని ఇది ఏ విద్యుత్ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుందన్నారు ఎమ్మెల్యే సీతక్క(MLA Seethakka).
ఈ తొమ్మిది ఏళ్ల దొర ఏలుబడిలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచిన ఘనుడు సీఎం కేసీఆర్ అని సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో అవినీతి , అక్రమాలు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. తాము పవర్ లోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ అవినీతి పై విచారణ చేపడతామని హెచ్చరించారు. ఇదే సమయంలో తమ పార్టీ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. వ్యవసాయానికి, రైతులకు మేలు చేకూర్చిన ఘనత ఒక్క తమ పార్టీకి మాత్రమే ఉందన్నారు దాసరి సీతక్క.
సీఎం కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తాము గెలుపొందడం ఖాయమని జోష్యం చెప్పారు సీతక్క.
Also Read : TMC Win Panchayat Poll : పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ హవా
