MLA Seethakka : మణిపూర్ ఘటనపై సీతక్క ఫైర్
బీజేపీకి కావాల్సింది ఓట్లు, సీట్లు
MLA Seethakka : మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన సభ్య సమాజాన్ని, దేశాన్ని నివ్వెర పోయేలా చేసింది. యావత్ ప్రపంచం భారత్ ను అనుమానంగా చూసేలా చేసింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువు తీరాక దళితులు, బహునులు, మైనార్టీలపై దాడులు పెరిగి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
MLA Seethakka Firing
మణిపూర్ ఘటన యావత్ మహిళా జాతిని కించ పరిచేలా ఉందన్నారు. బీజేపీకి కావాల్సింది ఓట్లు, సీట్లు, దేశ సంపద మాత్రమేనని మిగతా ప్రజల గురించి, సమస్యల గురించి పట్టించుకోదన్నారు. ఉన్న వనరులను ధ్వంసం చేయడం, అయిన వారికి కట్ట బెట్టడం, ఆపై వారికి గంప గుత్తగా అప్పగించడం తప్ప ఇంకేమీ దేశానికి చేసింది లేదన్నారు.
దేశ ప్రజలు ఏమై పోయినా సరే మోదీకి పట్టదన్నారు. ఆయన ఎంత సేపు తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం తప్ప సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టిన దాఖలాలు లేవన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క(MLA Seethakka). రేప్ కేసు నిందితులను విడుదల చేసిన ఘనత మోడీ సర్కార్ కే దక్కుతుందన్నారు. మణిపూర్ గురించి కనీసం స్పందన లేక పోవడం దారుణమన్నారు సీతక్క.
Also Read : RS Praveen Kumar : దేశాన్ని మణిపూర్ మోడల్ చేస్తారా