MLA Seethakka : అసెంబ్లీ నుంచి సీతక్క వాకౌట్
మాట్లాడ నీయడం లేదంటూ ఆరోపణ
MLA Seethakka : కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు శాసన సభ నియోజకవర్గం ఎమ్మెల్యే దాసరి సతీక్క ఆదివారం తెలంగాణ శాసన సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని ఆరోపించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించ నీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
MLA Seethakka Walkout
అందుకే అసెంబ్లీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని మండిపడ్డారు ఎమ్మెల్యే సీతక్క(MLA Seethakka). రాష్ట్రంలో పూర్తిగా రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. తమను ఎన్నుకున్నది ప్రభుత్వం ఏది చెబితే అది తల ఊపేందుకు కాదన్నారు. తాము ప్రస్తావించిన ఏ సమస్యకు సరైన సమాధానం ఇవ్వడం లేదన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు దాసరి సీతక్క.
ఇప్పటికే బీఏసీ మీటింగ్ లో తాము 20 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని కోరామని కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకు ఒప్పు కోలేదన్నారు. దీన్ని బట్టి చూస్తేనే ప్రభుత్వానికి ప్రజల పట్ల ఎంత శ్రద్ద, నిబద్దత ఉందో అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే సీతక్క.
తనకు వాకౌట్ చేయడం తప్ప మరో మార్గం కనిపించ లేదన్నారు. బీఆర్ఎస్ సర్కార్ పై భగ్గుమన్నారు.
Also Read : RTC Bill Approved : ఎట్టకేలకు ఆర్టీసీ బిల్లుకు ఆమోదం